టాలీవుడ్ మాస్ మహారాజా.. రవితేజ హీరోగా ‘డిస్కోరాజా’ నిర్మితమవుతోంది. దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ కథ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అయితే సైంట్ ఫిక్ కి సంబంధించిన కొన్ని అంశాల్లో స్పష్టత లోపించడం పట్ల రవితేజ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంతేకాదు ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజన్ కి గురి కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని మార్పులు .. చేర్పులు సూచించాడట.
అందుకు తగిన విధంగానే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే రీ షూట్ కార్యక్రమాలు పూర్తవుతాయట. అన్ని పనులను చకచకా పూర్తిచేసి, జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.