Lal Salaam OTT:
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన Lal Salaam సినిమాకి ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 2024లో విడుదలైన ఈ స్పోర్ట్స్ డ్రామా సామాజిక గొడవల నేపథ్యంలో సాగుతుంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోయింది. సినిమా విడుదలైనప్పటికీ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నప్పటికీ, ఇంకా విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో రజనీ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య రజనీకాంత్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. Lal Salaam సినిమా డైరెక్టర్ కట్ వెర్షన్ త్వరలోనే ఓటీటీలో విడుదలవుతుంది. ఇది పూర్తిగా థియేట్రికల్ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుందట. సినిమాలో కొంత లాస్ట్ ఫుటేజ్ ను కొత్త కట్లో జోడించారని ఐశ్వర్య పేర్కొన్నారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కొత్త కట్ కోసం మళ్లీ సంగీతం అందించారని, దీనికి ఆయన ఎటువంటి అదనపు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని ఐశ్వర్య అన్నారు. దీనితో లాల్ సలాం ఓటీటీ విడుదల త్వరలోనే ఉంటుంది అని ఫ్యాన్స్ అంచనా. ఇది రజనీకాంత్ అభిమానులకు నిజంగా శుభవార్తే. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.
Read More: SIIMA 2024 అవార్డు విన్నర్ జాబితా చూస్తే మతి పోవాల్సిందే