జలాంతర్గామి నేపధ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న “ఘాజీ” అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు “ఘాజీ” చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న “ఘాజీ” చిత్రంపై ప్రముఖ దర్శకులు చేసి ట్వీట్లు..
రాజమౌళి: ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా కెప్టెన్ & క్రూ అద్భుతమైన ప్రదర్శనతో అలరించారు. రానాకి శుభాకాంక్షలు!
క్రిష్: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు, ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించినందుకు “ఘాజీ” చిత్ర బృందానికి రానాకి నా ధన్యవాదాలు.
కొరటాల శివ: “ఘాజీ” చిత్రాన్ని చూస్తున్నంతసేపూ ఒక అపురూపమైన అనుభూతికి లోనయ్యాను. దర్శకుడు సంకల్ప్ అండ్ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ గా రాణా సబ్ మెరైన్ ను ఎంత చాకచక్యంతో నడిపించాడో దర్శకుడు అంతకుమించిన నేర్పుతో చిత్రాన్ని రూపొందించాడు. కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు నా శుభాకాంక్షలు. నా స్నేహితుడు మధి సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా మెచ్చుకొని తీరాలి.
వంశీ పైడిపల్లి: దర్శకుడు సంకల్ప్ కి ఈ చిత్రం బ్రిలియంట్ డెబ్యూ, అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం “ఘాజీ”.
వీరితోపాటు దర్శకులు తేజ, మారుతి కూడా “ఘాజీ” చిత్రాన్ని, చిత్ర బృందాన్ని అభినందించారు!