Sukumar :దర్శకుడు సుకుమార్.. 2004 లో ఆర్య సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. జోనర్ ఏదైన తన మార్క్ చూపిస్తాడు. సుకుమార్. లెక్కలు, ఫిజిక్స్ చెప్తూ మాస్టర్ లా ఎంతోమంది స్టూడెంట్స్ ని లైన్లో పెట్టిన సుక్కు మాస్టర్ డైరెక్టర్ గా మారి ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. నేటితో 20 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్నారు.
2004లో ‘ఆర్య’ సినిమాతో అల్లు అర్జున్ ని కొత్తగా పరిచయం చేసి జనాలకు ఒక కొత్త ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని చూపించి ఫీల్ మై లవ్ అనేలా చేసాడు. యూత్ అంతా సుకుమార్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయారు, ఆర్యతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత చేసిన ‘జగడం’ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కలేకపోయినా ఆ టేకింగ్ కి రాజమౌళి సైతం ఆశ్చర్యపోయి అభినందించారు. యూత్ జగడం లో రామ్ క్యారెక్టర్‌కి నచ్చింది. ‘ఆర్య 2’ అంటూ మరో కొత్త లవ్ స్టోరీని ఫీల్ అయ్యేలా చేసాడు. ఇక ‘100 % లవ్’ అంటూ బావమరదల లవ్ ట్రాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. ‘1 నేనొక్కడ్నే’ అంటూ సరికొత్త ప్రయోగం చేశాడు. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌తో.. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడమే కాక తన లాజిక్స్ తో సినిమాని అదరగొట్టేసారు. ప్రతి కొడుకు నాన్నకు ప్రేమతో అని పాడేలా చేశాడు. సుకుమార్ లవ్ స్టోరిలకు ఫేమస్ అని అంతా అనుకునే టైంలో రాజమౌళి ఓ సారి.. సుకుమార్ లవ్ స్టోరీలు చేస్తున్నాడు కాబట్టి మేమంతా ఇక్కడ ఉన్నాం.
సుకుమార్ మాస్ సినిమాలు మొదలుపెడితే అంతే సంగతులు అన్నారు. ఆయన మాటల్ని నిజం చేస్తూ.. సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాతో ఒక్కసారిగా తనలోని మాస్ విశ్వరూపం చూపించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా రంగస్థలం నిలిచిపోయింది. చిరంజీవి సైతం ఆ సినిమాని పొగిడారు. ఈ సినిమాని ఎంతో నేచ్యురల్‌గా తెరకెక్కించారు సుకుమార్. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంత నటన కూడా మంచి మార్కులు పడ్డాయి.
ఆ తరువాత సుకుమార్ మరో మాస్ మూవీ ‘పుష్ప’ ప్రేక్షకులకు పునకాలు తెప్పించాడు. పుష్ప అంటూ పాన్ ఇండియా మొత్తం తగ్గేదేలే అనిపించారు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేశాడు సుకుమార్. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో సాధించలేని నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ సాధించారంటే ఆయనతో ఆ రేంజ్ లో సుకుమార్ యాక్టింగ్ చేయించారు.
ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ కూడా సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు అంటూ అతిసయోక్తి కాదేమో. ఈ సినిమా సూపర్ హట్ కావడంతో.. సీక్వెల్స్ ‘పుష్ప 2’ చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. దీని తరువాత రామ్ చరణ్‌తో మరో సినిమా ప్రకటించాడు. మరి ఈ సినిమాతో ఇంకే రేంజ్ లో కొత్త కథని చూపించి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.
తొలి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్న సుకుమార్ ఆయన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకుల మనస్సులో అభిమానం సంపాదించుకున్నారు. స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైనా ఆయన అంటే ఎందుకు అందరికి స్పెషల్ అంటే తను సినిమాలు తీయడం మాత్రమే కాదు ట్యాలెంట్, ప్యాషన్, కష్టపడే తత్త్వం ఉన్న చాలా మందికి సపోర్ట్ చేయడానికి నిర్మాతగా మారారు.
సుకుమార్ రైటింగ్స్ అంటూ కొత్త సినిమాలకు, దర్శకులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చాలా మంది ఇప్పుడు దర్శకులుగా మారి హిట్ సినిమాలు చేస్తున్నారు. తన శిష్యుల సినిమా ప్రమోషన్స్ కి వచ్చి మరీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు సుకుమార్. అందుకే ఆయన చాలా స్పెషల్.