HomeTelugu Trendingపెళ్ళి చేసుకున్న యువ దర్శకుడు

పెళ్ళి చేసుకున్న యువ దర్శకుడు

director siva kumar gets ma
ప్రముఖ దర్శకురాలు స్వర్గీయ బి. జయ, స్టార్ పీఆర్వో, నిర్మాత, సూపర్ హిట్ పత్రిక అధినేత, స్వర్గీయ బి.ఎ.రాజు తనయుడు, యువ దర్శకుడు శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే.. తనకు అచ్చి వచ్చిన 22వ తేదీన శివకుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. 2022 సంవత్సరం, జనవరి 22వ తేదీ 22 గంటలకు తన స్నేహితురాలు దండిగె లావణ్య మెడలో శివకుమార్ మూడు ముడులూ వేశాడు. పూణేలో పుట్టి పెరిగిన లావణ్య మరాఠీ వనిత. హైదరాబాద్ లో ఆమె కుటుంబం స్థిరపడింది. లావణ్యతో తన స్నేహాన్ని వివాహబంధంగా మార్చుకున్నానని శివకుమార్ తెలిపాడు. నిరాడంబరంగా జరిగిన ఈ రిజిస్టర్ మ్యారేజ్ సమాచారాన్ని శివకుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియచేయడంతో, సినిమా రంగానికి, జర్నలిజానికి చెందిన హితులు, సన్నిహితులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu