HomeTelugu Trendingఇండియన్-2లో కొత్త టెక్నాలజీతో శంకర్ ప్రయోగం

ఇండియన్-2లో కొత్త టెక్నాలజీతో శంకర్ ప్రయోగం

Indian 2 movie
టెక్నాలజీని వాడటంలో ముందుండే దర్శకుడు శంకర్‌. రోబో సినిమా కోసం శంకర్‌ టెక్నాలజీని ఎలా వాడుకున్నాడో ఆయన ఆలోచన ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దర్శకుడు శంకర్ సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్ వర్క్‌తో తెరకెక్కిన పాటలు లెక్క లేననని ఉన్నాయి.

తాజాగా శంకర్‌ తన కొత్త సినిమా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్‌ ఓ వైపు ఇండియన్‌-2 మరోవైపు గేమ్‌ చేంజర్‌ సినిమాలు చేస్తున్నాడు. అయితే ముందుగా ఇండియన్‌-2 సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశలో ఉంది.

ఇండియన్‌-2 మూవీని సక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్‌ సహా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పెండింగ్‌ ఉండటంతో సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ తెగ వైరల్ అవుతోంది.

ఇండియన్-2 కోసం శంకర్ చనిపోయిన వాళ్ళను టెక్నాలజీ సహాయంతో తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట. దివంగత నటులు వివేక్‌, నెడుముడి వేణులు ఇండియన్‌-2 షూట్‌లో కొన్ని రోజులు పాల్గొన్నారు. ఇండియన్‌-2 మొదలుపెట్టేనాటికే శంకర్‌ వీళ్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారట.

ఇప్పుడు ఆ ఇద్దరు నటులు లేరు. ఈ క్రమంలో బాడీ డబుల్స్‌ని వాడి కొత్త తరహా హాలీవుడ్ టెక్నాలజీతో నిజంగా వాళ్ళు మళ్ళీ వచ్చారా అనిపించేలా శంకర్‌ తీయబోతున్నట్టు చెన్నై టాక్. గతంలో యమదొంగ సినిమాలో రాజమౌళి స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఓ పాటలో వీఎఫ్‌ఎక్స్‌తో రెప్పపాటు కనిపించేలా చేశాడు.

ఇప్పుడు శంకర్‌ అయితే లేని వాళ్లతో సీన్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాడంటే గొప్ప విషయమే. నిజానికి చనిపోయిన వాళ్లను టెక్నాలజీతో సీన్స్‌ తెరకెక్కించడమనేది కత్తి మీద సామే.

2010లో వచ్చిన రోబో సినిమాతో అప్పుడే ప్రేక్షకులను అబ్బురపరిచిన శంకర్‌కు ఇది క్రియేట్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇప్పుడు టెక్నాలజీ మరింత పెరిగింది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సిద్ధార్థ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. స్వర మాంత్రికుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu