HomeTelugu Big Storiesఘనంగా డైరెక్టర్‌ శంకర్‌ కుమారై వివాహం

ఘనంగా డైరెక్టర్‌ శంకర్‌ కుమారై వివాహం

director shankar daughter m

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం నేడు (ఆదివారం) ఉదయం ఘనంగా జరిగింది. రోహిత్‌ దామోదరన్‌ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన కుమారుడు ఉదయనిధి విచ్చేసి వధూవరులకు అభినందనలు తెలిపి వాళ్లని ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, ఇరు కుటుంబ పెద్దలతో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రోహిత్‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో క్రీడాకారుడు. ఆయన తండ్రి దామోదరన్‌ చెన్నైకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. మదురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కి ఆయన యజమాని. ఐశ్వర్య వృత్తిరీత్యా డాక్టర్‌. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలోనే మహాబలిపురంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇదిలా వుంటే శంకర్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు.

director shankar

Recent Articles English

Gallery

Recent Articles Telugu