HomeTelugu Trendingపెళ్లి పీటలు ఎక్కబోతున్న శంకర్‌ పెద్ద కుమార్తె!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న శంకర్‌ పెద్ద కుమార్తె!

Director shankar daughter a

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. పెళ్లి తేదీ పై స్పష్టత లేదు. వృతిరీత్యా శంకర్‌ కూతురు ఐశ్యర్య డాక్టర్. రోహిత్‌ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్.

ఇక రోహిత్‌ తండ్రి రామోదరన్‌ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్‌ టీమ్‌కు స్పాన్సర్‌ కూడా. అయితే గత మేలో శంకర్‌ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసింది. కాగా శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్‌. ప్రస్తుతం శంకర్‌ ఇండియన్‌-2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో అపరిచితుడు రీమేక్‌ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu