తమిళ డైరెక్టర్ శక్తి చిదంబరం తన ఇంట్లో ఉన్న చైనా వస్తువులను తగలబెట్టారు. చైనాలో తయారైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టేప్ రికార్డర్లను కుప్పగా పోసి, నిప్పటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారని, మన సైనికులను హతమార్చారని చెప్పారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలని… భారతీయులందరూ చైనా ఉత్పత్తులను వాడకుండా జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఇకపై తాను చైనా వస్తువులను కొనుగోలు చేయనని ఆయన చెప్పారు. కాగా చైనా సైనికుల దాడిలో 20 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై భారతీయులు రగిలిపోతున్నారు. చైనా వస్తువులను కొనడం ఆపేస్తే ఆ దేశానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుందని పలువురు అంటున్నారు. బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ ఓ క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు.