విశ్వక్ సేన్, శైలేష్ కొలను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఇపుడు హిట్ 2 సినిమాతో థ్రిల్ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. తాజాగా అడివిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిట్ 2 టీజర్ అప్‌డేట్ అందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అంతేకాకుండా.. నటుడు రావురమేశ్‌కు టీంలోకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను కూడా అందరితో పంచుకున్నాడు శైలేష్ కొలను.
థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశాడు. నవంబర్ 3న టీజర్ లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. ‘హిట్-2’ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్‌నేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Introducing the ever versatile #RaoRamesh from #HIT2 as ‘Nageswara Rao’, ADGP of #HIT Vizag❤️🔥
Teaser out on NOV 3rd🔥
– https://t.co/Q8PguX0xw3#HIT2onDec2@AdiviSesh @NameisNani @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/MG25Ye044a— Sailesh Kolanu (@KolanuSailesh) November 1, 2022