HomeTelugu Big Storiesధనుష్‌ కోసం ఇండియాకు వస్తున్న 'ది గ్రే మ్యాన్' డైరెక్టర్స్‌

ధనుష్‌ కోసం ఇండియాకు వస్తున్న ‘ది గ్రే మ్యాన్’ డైరెక్టర్స్‌

Director russo brothers upc

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయనకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఇటీవల ‘మారన్’తో పర్వాలేదనిపించిన ధనుష్‌.. హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్లు రూసో బ్రదర్స్‌ (జో రూసో-ఆంటోనీ రూసో) దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ త్వరలో ఇండియాకు రానున్నారు. అది కూడా ధనుష్ కోసం భారత్‌కు వస్తున్నట్లు వాళ్లు తెలిపారు.

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌ మీట్‌లో ఇండియాకు వస్తున్నట్లు రూసో బ్రదర్స్‌ తెలిపారు. ”మేం తెరకెక్కించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ వీక్షించేందుకు, మా స్నేహితుడు ధనుష్‌ను చూసేందుకు ఇండియాకు వస్తుండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో కలుద్దాం” అని తెలిపారు.

Director russo 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu