కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్లో పలువురు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉన్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకూ కరోనా సోకినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలులేవని, అయినా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు సాధారణ జ్వరంతో బాధపడినట్లు వెల్లడించారు. జ్వరం తగ్గిన తర్వాత కరోనా టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.