HomeTelugu Big Storiesరాధేశ్యామ్ : ప్రభాస్‌ లుక్‌ వైరల్‌

రాధేశ్యామ్ : ప్రభాస్‌ లుక్‌ వైరల్‌

Director radha krishna shar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే హీరోహీరోయిన్‌లుగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. అన్ని బావుంటే ఈ సినిమా ఈ సంక్రాంతి విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. మరో మంచి రోజు చూసి ఈ సినిమా విడుదల చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఫ్యాన్స్ ని నిరాశపడకుండా డైరెక్టర్ రాధా నిత్యం ఏదో ఒక అప్డేట్ ని ఇస్తూ ఉన్నాడు. తాజాగా రాధేశ్యామ్ మేకింగ్ స్టిల్స్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

విక్రమాదిత్య, ప్రేరణలకు సీన్స్ వివరిస్తున్న రాధా తో సెట్ అంతా హీటెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ స్టిల్స్ లో ప్రభాస్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా గ్రీన్ అండ్ ఎల్లో చెక్స్ షర్ట్ లో డార్లింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా రిలీజ్ చేయకపోయినా అభిమానుల ఆనందం కోసం ఇలాంటి స్టిల్స్ అప్పుడప్పుడు రిలీజ్ చెయ్ అన్న అంటూ ఫ్యాన్స్ డైరెక్టర్ ని కోరుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ లుక్ సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu