HomeTelugu Trendingబన్నీ ట్వీట్‌కి పూరీ ఫన్నీ రిప్లై

బన్నీ ట్వీట్‌కి పూరీ ఫన్నీ రిప్లై

Bunny tweet Puri funny repl

టాలీవుడ్‌లో మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత హిట్ అందుకున్న తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఇన్నాళ్లూ తన మాటలను సినిమాల్లో హీరోలతో పలికించిన పూరి.. ఇప్పుడు తన ఆలోచనలు, సూచనలను పోడ్‌కాస్ట్ ద్వారా శ్రోతలతో పంచుకుంటున్నాడు. పూరి తన పోడ్‌కాస్ట్‌ల ద్వారా ఆడియో రూపంలో స్ఫూర్తివంతమైన విషయాలను చెబుతున్నాడు. వీటికి మంచి ఆదరణ లభిస్తోంది.

తాజాగా పూరి పోడ్ కాస్ట్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించాడు. దర్శకుడు పూరీపై ప్రశంసలు కురిపించాడు. పూరి గారు మీరు ఎంపిక చేసుకున్న టాపిక్ అద్బుతం. మీరు చెబుతున్న అభిప్రాయాలు గొప్పగా అనిపించాయి. వ్యక్తిగతంగా నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్నింటినో మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. దీనికి పూరీ స్పందిస్తూ బన్నీ.. నీ ట్వీట్ నాకు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది. నీలాంటి సక్సెస్ ఫుల్ యంగ్ స్టర్ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందంలో రాత్రి మరో పెగ్ ఎక్కువ వేస్తాను చీర్స్’ అంటూ ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu