HomeTelugu Trendingసినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రేమమ్‌ డైరెక్టర్‌

సినిమాలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రేమమ్‌ డైరెక్టర్‌

Director Premam announced h
ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ ‘ఆల్ఫోన్స్ పుతిరన్’ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. నివిన్ పాలీ, మడోన్నా సెబాస్టియన్, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం ప్రేమ‌మ్. ఆల్ఫోన్స్ పుతిరన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2015లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన మ‌ల‌ర్ పాత్ర ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఇంపాక్ట్ చేసింది.

ఇక‌.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను చూడ‌డం మొద‌లుపెట్టారు. తాజా ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఆల్ఫోన్స్ పుతిరన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తాను డైరెక్ష‌న్ నుంచి సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉందని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్లడించారు.

నేను నా సినిమా, థియేటర్ కెరీర్‌ను ముగించుకుంటున్నాను. నాకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉంద‌ని నిన్న తెలిసింది. ఈ విష‌యంపై ఎవ‌రిని బాధ పెట్టాలి అనుకోట్లేదు. నా సినిమా కెరీర్‌ను ముగించిన షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, సాంగ్స్ OTTల‌లో మూవీస్ చేస్తూ ఉంటాను. నాకు సినిమాల‌ నుంచి దూరంగా పోవాల‌ని లేదు. కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇక నేను నిలబెట్టుకోలేని వాగ్దానాన్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఆరోగ్యం బలహీనంగా లేదా అనూహ్యంగా ఉన్నప్పుడు, లైఫ్ అనేది ఇలా ఇంటర్వెల్ పంచ్ వంటి ట్విస్ట్‌ను తెస్తుంది అంటూ పుతిరన్ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చాడు.

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధికి గురైన వ్యక్తులు ఇతరులతో మాట్లాడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి ఇబ్బంది ప‌డతారు. ఈ వ్యాధి ఏ వయసులో అయిన బయట పడవచ్చు. ముఖ్యంగా ఇది పిల్లలలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఫోన్‌ ఎక్కువగా చూసే పిల్లలు కూడా ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!