హిందీ దర్శకుడు నిషికాంత్ కామత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. నిషికాంత్ కొంత కాలంగా లివర్ సిరోసిస్‌తో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చారు. నిషికాంత్ కామత్ 2015 లో విడుదలైన అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన దృశ్యం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ చిత్రంలో టబు ప్రధాన పాత్రలో నటించింది. దృశ్యం సినిమాకు నిషికాంత్ దర్శకత్వం వహించాడు. జాన్ అబ్రహం నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించారు. అంతేకాదు ఆయన మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి పాపులర్ అయ్యారు. కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించాడు. నిషికాంత్ 2005 లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మరాఠీ సినిమాలో ఆ సంవత్సరం అతిపెద్ద హిట్‌గా నిలిచింది.