‘జయం’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘కిక్’ వంటి పలు తెలుగు సినిమాలను రీమేక్ చేసి తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు మోహన్ రాజా. తన తమ్ముడిని పెద్ద హీరోని చేసిన ఆయన ఇప్పుడు ఓ సినిమా కోసం విలన్‌గా మారారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘2014లో ‘ఎన్న సత్తం ఇంద నేరం’ చిత్రంలో నటించిన తర్వాత పలు సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ నేను నటించలేదు. ఇప్పుడు వెంకట్ కృష్ణ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తున్న ‘యాదుం ఊరే యావరుం కేళీర్’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నా. ఎందుకంటే ఈ చిత్రంలో నా పాత్ర బాగా నచ్చింది. అందుకే వెంటనే ఒప్పుకున్నా. త్వరలో ప్రేక్షకుల ముందుకు విలన్‌గా వస్తానని’ పేర్కొన్నారు.