టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతిశెట్టి. దీంతో ఈమెకు వరుస ఆఫర్ల వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా, లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉండగా ఓ సన్నివేశం షూట్ చేస్తున్న టైమ్ లో కృతిశెట్టిని డైరెక్టర్ లింగుస్వామి మందలించినట్లు సమాచారం. సీనియర్ నటుడు నాజర్-కృతిశెట్టిల సెంటిమెంట్ సీన్ షూట్ చేస్తుండగా సరైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో కృతి ఫెయిల్ అయిందట. అప్పటికే చాలా టేకులు తీసుకున్నా కృతి సరిగ్గా పర్‌ఫార్మ్ చేయకపోవడంతో విసిగిపోయిన డైరెక్టర్ ఆమెపై గట్టిగా అరిచినట్లు సంబంధిత వర్గాల సమాచారం.