బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన స్వీటీ అనుష్క ఎలాంటి పాత్రల్లోనైనా పరకాయప్రవేశం చేసేస్తుంది. ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో టాప్‌లో ఉన్న స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత అనుష్క ఓ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్లుస తెలుస్తోంది. సందేశాత్మక చిత్రాలు చేయడంలో పేరుతెచ్చుకున్న టాప్‌డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో అనుష్క కీలక పాత్ర చేయబోతుందట. ఈ ప్రాజెక్టుకు అనుష్క ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. గతంలో క్రిష్ డైరెక్షన్‌లో వేదం సినిమా నటించింది అనుష్క. ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.