యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ ఆతర్వాత ఒక్క ప్లాప్ కూడా చూడలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టర్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ టాప్ డైరెక్టర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడట. త్వరలో ఓ స్టార్ హీరో తో సినిమాను నిర్మించాలని చూస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటర్స్ పేరుతో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కొరటాల కూడా అదే బాటలో సినిమాలను ప్రొడ్యూస్ చెయ్యాలని చూస్తున్నాడట.