‘తీస్ మార్ ఖాన్’ దర్శకుడు కల్యాణ్ జీ గోగణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కళింగరాజు’. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. నవయుగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రవికుమార్, ఐ. రవి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి నేహా సింగ్ సమర్పకురాలిగా, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఖుషీ సహా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రము్‌ఖ నటుడు హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిచనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.