నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘వి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ ఇప్పటికే స్టార్ట్ చేశారు మూవీయూనిట్. అయితే నానికి దర్శకుడు ఇంద్రగంటిమోహన్ కృష్ణ బ్రేకులేసినట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో పీఆర్ టీంకి అతి తగ్గించుకోవాలని చెప్పాడట. వన్ సైడ్ ప్రమోషన్ మంచిది కాదంటూ ఇంద్రగంటి నాని అండ్ టీంని మందలించినట్టు వినిపిస్తోంది. ఈ వార్నింగ్ కు కారణమేంటంటే..
‘వి’ సినిమా లో ఇద్దరు హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. నాని అంత సీనియర్ కాకపోయినా సుదీర్ బాబు కుడా అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. అయితే నాని టీమ్ మాత్రం కేవలం నానిని హైలెట్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు వన్ సైడ్ ప్రమోషన్ మంచిది కాదని ఇంద్రగంటి నానికి వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటించాడు.