స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె నీలిమ నిశ్చితార్ణం రవి ప్రక్యాతో వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ వేడుకను నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖలు హాజరయ్యారు.
సోషల్ మీడియా ద్వారా నీలిమ.. తన జీవితకాల ప్రయాణం మొదలైంది అని ప్రకటించారు. ఆమెకు నెటిజెన్లు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన తండ్రి తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమాకు నీలిమ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
💛✨ the beginning of forever ✨💛#RaviPrakhya #NeelimaGuna pic.twitter.com/C7IyaoW7Vg
— Neelima Guna (@neelima_guna) October 8, 2022