‘భమ్ భోలే నాథ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘రైట్ రైట్’,’ఎల్ 7′ వంటి చిత్రాల్లో నటించిన
పూజా జవేరి ప్రస్తుతం ‘ద్వారకా’ సినిమాలో నటిస్తోంది. అయితే తన నటించిన ఏ సినిమా
కూడా ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. దీంతో అమ్మడు పెద్దగా ఎవరికీ నోటీస్
కాలేదు. అయితే ద్వారకా చిత్రంతో కచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రాఫిక్స్ డిజైనింగ్ చదువుకున్న పూజా
కొన్ని బాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. తనే కొరియోగ్రాఫర్ గా ఓ
బాలీవుడ్ సినిమాకు కూడా పని చేసింది. అయితే భవిష్యత్తులో హీరోయిన్ గానే కాకుండా…
డైరెక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతోంది. పూజాకు స్టోరీస్ రాయడమంటే
ఇష్టమట. ఆ మక్కువతోనే కథను సిద్ధం చేసుకొని డైరెక్ట్ చేయాలనుందని చెబుతోంది. మరి
డైరెక్టర్ గా అమ్మడుకి అవకాశాలు ఎవరు ఇస్తారో.. చూడాలి!