తమిళ ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల ఇకలేరు. కొంతకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 69 సంవత్సరాల మనోబాల గత రెండు వారాలుగా కాలేయ సంబంధిత సమస్యల కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
ఈ వార్త తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురి చేసింది. అతని అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 1970లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆయన 350కి పైగా సినిమాల్లో నటించాడు. 20కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్బ్ కావడం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
ఆ తరువాత తెలుగులో మహానటి, దేవదాసు సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో చివరగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు. శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ లో విడుదలైన డాన్ చిత్రంలో స్కూల్ టీచర్ గా అందరినీ నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు