టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం సినిమా షూటింగులను ఆపేశామని తెలిపారు. అయితే నెలల తరబడి షూటింగులను ఆపేయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. నిర్మాతలపై భారాన్ని తగ్గించాలనేదే తమ అభిమతమని అన్నారు. ప్రస్తుతం తాము నాలుగు అంశాలపై చర్చిస్తున్నామని చెప్పారు.
ఎన్ని వారాల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వెళ్లాలనే విషయాన్ని నిర్ణయించేందుకు ఒక కమిటీని వేశామని. ఆ కమిటీ ఓటీటీ అంశంపై పనిచేస్తుందని చెప్పారు. థియేటర్స్ లో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజ్ లు ఎలా ఉండాలనే దానిపై మరో కమిటీ వేశామని… ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో చర్చలు జరుపుతుందని తెలిపారు. ఫెడరేషన్ వేజెస్, ఎన్ని గంటల పాటు షూటింగులు జరగాలనే దానిపై మరో కమిటీని వేశామని చెప్పారు. ఈ నాలుగు కమిటీలు హోమ్ వర్క్ చేస్తున్నాయని తెలిపారు. త్వరలోనే రిజల్ట్ వస్తుందని చెప్పారు.