Janaka Aithe Ganaka release date:
సుహాస్ చిన్న, మధ్య స్థాయి చిత్రాలతో విజయవంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అతను మరో సామాజిక కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రం పేరు జనక అయితే గనక. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని చిన్న సినిమాల కోసం కొత్తగా ప్రారంభించిన బ్యానర్‌పై నిర్మించారు.
దిల్ రాజుకి ఒక సినిమాకి ఉన్న విలువను అంచనా వేయడంలో మంచి అనుభవం ఉంది. ఇప్పుడు జనక అయితే గనక సినిమాపై కూడా ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. సుహాస్ కూడా ఈ సినిమా ద్వారా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని సుహాస్ కూడా బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది.
తాజాగా, దిల్ రాజు ఈ చిత్రానికి ఎర్లీ ప్రీమియర్స్‌ను ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం, జనక అయితే గనక సినిమా అక్టోబర్ 6న సుహాస్ స్వస్థలమైన విజయవాడలో, అక్టోబర్ 8న దర్శకుడి స్వస్థలం తిరుపతిలో ప్రీమియర్ అవ్వముంది. ఈ రెండు ప్రీమియర్ షోల తర్వాత, ఈ సినిమా అక్టోబర్ 10న అమెరికాలో ఎర్లీ ప్రీమియర్ షోలు జరగబోతున్నాయి. ఇది దిల్ రాజు ఇప్పటికే శతమానం భవతి, హ్యాపీ డేస్ సినిమాలతో అమెరికాలో చేసిన ఎర్లీ ప్రీమియర్ ట్రెండ్‌ను కొనసాగింపుగా తీసుకున్న నిర్ణయం.
‘జనక అయితే గనక’ కొత్త రిలీజ్ డేట్ https://t.co/s9l1DSsRlV pic.twitter.com/w0lqBeATOR
— ARK TV Telugu (@ArkTelugu) September 10, 2024
అంతేకాక, జనక అయితే గనక కి అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ఉంటాయి. అక్టోబర్ 12న సినిమా అధికారిక విడుదల అవ్వనుంది. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు ఈ విధమైన విడుదల ఆర్థిక ప్రమాదాన్ని అవకాశం ఉంది అని.. కానీ అది తీసుకోవటానికి కూడా సిద్ధమని చెప్పారు. అయితే, ఈ సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడుపోయాయని దిల్ రాజు వెల్లడించారు.
అంతేకాక, మీడియా కోసం కూడా ప్రత్యేకంగా ఒక షో ప్లాన్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు. గతంలో బలగం సినిమాకి మీడియా ఇచ్చిన మద్దతును జనక అయితే గనక సినిమాకు కూడా ఇవ్వాలని కోరారు. సినిమా నచ్చకపోతే మాత్రం ఆ విషయాన్ని మీడియా సైలెంట్‌గా ఉంచాలని ఆయన సరదాగా నవ్వుతూ అన్నారు.
Read More: The GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!