స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్‌రాజ్‌కు మంచి గుర్తింపు ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటికే ఆయన 50కి పైగా చిత్రాలు నిర్మించారు. ఇక తాజాగా ఆయన వారసురాలు హన్షిత, హర్షిత్ రెడ్డిలను నిర్మాతలుగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘బలగం’ సినిమా భారీ విజయం సాధించింది. దిల్‌రాజు ఇరవయేళ్ల కెరీర్‌లో ఏ సినిమా తీసుకురానంత పేరును ‘బలగం’ ఒక్కటే తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో ఓ బ్రాండ్‌గా మారిపోయాడు దిల్ రాజు. ఇతర భాషలకు కూడా తన ప్రొడక్షన్‌ను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజ్ భార్య వైఘా రెడ్డి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. SVC బ్యానర్‌లో రూపొందే సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకునేందుకు భార్య వైఘా రెడ్డి ఇంట్రెస్ట్ చూపుతోందని సమాచారం.
తెలుగులో విజయం సాధించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ హిందీ రీమేక్‌ను తనే హ్యాండిల్ చేయనుందని టాక్. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నాడు. ‘వెల్‌కమ్, సింగ్ ఈజ్ కింగ్, భూల్ భూలయ్య 2’ చిత్రాలను డైరెక్ట్ చేసిన అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే, దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ చేంజర్’ సినిమాని నిర్మిస్తున్నారు.
రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. వచ్చే ఏడాది మొదట్లో విడుదల కానుంది. మరోవైపు డైరెక్టర్ పరశురాం, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఈ మధ్యే ఒక సినిమా ప్రకటించారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు