ఈ సంక్రాంతికి పలువురి స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్లలో సమస్య అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ పరిస్థితులకు నిర్మాత దిల్‌రాజు ప్రధాన కారణమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ టైంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా హైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.
అప్పుడు ఏదో ఓ రకంగా నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారు. ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి నా గురించి మాట్లాడిన మాటలని కొన్ని వెబ్‌సైట్లు తప్పుగా వక్రీకరించాయి. నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా’ అని చెప్పారు.
‘వ్యాపార పరంగా వచ్చే విమర్శలని ఆయా వెబ్‌సైట్స్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు. తమిళ సినిమాను నేనే వాయిదా వేశాను. హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పాను. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయి.
నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ వైబ్‌సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా’ అని దిల్‌రాజు హెచ్చరించారు.
అయితే ఇప్పటికే ఈయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే ‘హనుమాన్’ తప్పితే మిగతా మూడు సినిమాలు గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ చిత్రాల్ని ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే వార్తలు రావడమే దీనికి కారణం అని అంటున్నారు.