ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొద్ది రోజులగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నట్లు ఆ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన.. నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటాను అని.. అందరికీ చెప్పే చేసుకుంటాను అని చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అలాగే, తన వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదని, త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన దిల్ రాజు, ఈ తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, నిజామాబాద్ లోని వెంకటేశ్వస్వామి గుడిలో ఇవాళ రాత్రి వివాహం చేసుకోనున్నట్టు సమాచారం. తన కుటుంబసభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దిల్ రాజ్ మొదటి భార్య అనిత అనారోగ్యంతో 2017లో చనిపోయారు.
— Sri Venkateswara Creations (@SVC_official) May 10, 2020