టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల వైఘా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వీరి అన్యోన్యమైన దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందని తెలిపేలా అప్పుడప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దిల్ రాజు తన భార్యతో కలిసి ఇచ్చిన రొమాంటిక్ ఫోజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
పెళ్లి తరువాత దిల్ రాజులో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజు పెళ్లి తర్వాత బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడని అర్థం అవుతోంది. మొదటిసారి సతీసమేతంగా తిరుమల సందర్శించిన ఆయన లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా లేకపోవడంతో కావలసినంత టైమ్ దొరకడంతో ఫిజికల్ ఫిట్నెస్ మీద కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వెయిట్ తగ్గడమే కాకుండా బాడీ షేప్ కూడా మార్చే పనిలో పడ్డాడట దిల్రాజు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా జిమ్ సెషన్ లో పాల్గొనడంతో పాటు తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు.