సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుంటూరు కారం’. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీతో పాటు దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా నాగ వంశీ మాట్లాడుతూ సినిమా చాలా బావుందని కానీ కొన్ని చోట్ల నెగెటివ్ రివ్యూలు ఇచ్చారంటూ చెప్పారు.
“సినిమాను అందరూ బాగా ఆదరించారు. ఫస్ట్ డే కలెక్షన్లు మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దాని కన్నా ఎక్కువే వచ్చాయి. అయితే రాత్రి ఒంటి గంట షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయ్. కానీ అవన్నీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో వచ్చేటప్పటికీ పాజిటివ్‌గా మారిపోయింది. ఫ్యామిలీస్ అంతా వచ్చి పండగ రోజు ఎంజాయ్ చేసే సినిమా అండి. దయచేసి.. పాటలు, ఫైట్‌లు, సెంటిమెంట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా అండి.. మిగిలినవి ఏవీ నమ్మకుండా థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి. మీరు ఎంటర్‌టైన్ అవుతారనే గ్యారెంటీ నాది.” అంటూ నాగ వంశీ అన్నారు.
ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. “గుంటూరు కారం రాత్రి ఒంటి గంట షో అయిపోయాక కొంచెం మిక్స్‌డ్ రివ్యూలు ఆడియన్స్ దగ్గరి నుంచి సోషల్ మీడియాలోనూ వచ్చాయి. నాకు కూడా షో అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫర్వాలేదండి, యావరేజ్ అని కొందరు.. ఇద్దరు ముగ్గురు బావుంది అని అన్నారు. కానీ నాకు పర్సనల్‌గా సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో దాన్నే మళ్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి సుదర్శన్ థియేటర్లో మళ్ళీ సినిమా చూశాను. ఇది ప్రాపర్ మహేశ్ బాబు క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని చేసిన సినిమా. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగెటివ్ వైబ్స్, రివ్యూలు, టాక్‌లో నుంచి.. బాలేదంట అంటూ థియేటర్లోకి వెళ్లినా సినిమాలోని విషయం కనెక్ట్ అయితే సినిమా స్టాండ్ అవుతుంది.
ఎన్నో సినిమాలు చూశాం.. అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పాజిటివ్ ఫిలిమ్. ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా.” అంటూ దిల్ రాజు అన్నారు. కలెక్షన్లు అన్నీ చూసిన తర్వాత, ప్రీవియస్ మహేశ్ బాబు సినిమా ఎంత చేసింది. ఇది ఎంత చేసింది అనేది చూసిన తర్వాత సినిమాకి మిక్స్‌డ్ టాక్స్ పోతాయని దిల్ రాజు చెప్పారు. అప్పటివరకూ ఎవరి మీదా మేము కామెంట్ చేసేది లేదు. చెప్పేది లేదు సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమాను ఏదైనా కానీ ఎవడూ ఆపలేడు. అది చరిత్ర అంటూ ధీమాగా చెప్పారు.