
Ram Charan remuneration after Game Changer flop:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. పొలిటికల్ థ్రిల్లర్, హై-టెక్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్… ఇలా అన్ని హంగులతో సినిమా తెరకెక్కింది. కానీ, రిలీజ్ తర్వాత అంచనాలను అందుకోలేకపోయింది.
బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాంతో, డిల్రాజు మరియు నిర్మాతలకు భారీ నష్టం వచ్చింది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లో పెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా మారింది.
నిర్మాత డిల్రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలను వెల్లడించారు. సినిమా మొదట ప్రాఫిట్ షేరింగ్ మోడల్ లో ప్లాన్ చేయబడింది. అంటే, రామ్ చరణ్ మరియు శంకర్ ఫిక్స్‌డ్ ఫీజు కాకుండా, ప్రాఫిట్ షేర్ తీసుకోవాలనుకున్నారు. కానీ, చిత్రీకరణ ఆలస్యం, బడ్జెట్ పెరగడం, డబ్బింగ్ సమస్యలు ఇలా అనేక ఇబ్బందులతో ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు.
ఫైనల్‌గా, రామ్ చరణ్, శంకర్ ఇద్దరూ ఫుల్ ఫీజు తీసుకున్నారని సమాచారం. అయితే, రామ్ చరణ్ తాను కొంత పారితోషికం తగ్గించుకున్నాడని, నిర్మాతలకు భరోసా ఇచ్చాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, డిల్రాజు బ్యానర్‌లో మరో సినిమా తక్కువ పారితోషికంతో చేయడానికి అంగీకరించాడనే టాక్ నడుస్తోంది.
డిల్రాజు మాట్లాడుతూ, SS రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి టాప్ డైరెక్టర్లు ఇప్పటికే ప్రాఫిట్ షేరింగ్ మోడల్ ను అనుసరిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఈ విధానం మరింత సాధారణం అవుతుందని అభిప్రాయపడ్డారు.