ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్తలు కొన్ని రోజులుగా బాగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఎవరూ ఖండించడం లేదంటే నిజమే అయ్యుంటుంది అనే అనుమానం అభిమానులు ఏర్పడిపోయింది. ఇక ఇప్పుడు ఈయన రెండో పెళ్లి ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా జరిగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈయనకు పెళ్లి ఎక్కడ జరిగింది., ఎలా జరిగిందనే అనే విషయం మాత్రం బయటకు రావడం లేదు. ఎక్కడ ఎలాంటి అప్‌డేట్స్ కానీ ఫోటోలు కానీ బయటకు రాలేదు. ఈయన పెళ్లి షాద్‌నగర్‌లోని ప్రకాష్‌రాజ్ గెస్ట్ హౌస్‌లో కొంత మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్టు సమాచారం. షాద్‌నగర్.. ఏయిర్ పోర్ట్‌కు దగ్గరగా ఉండటంతో అక్కడ పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. కాగా ఈ నిర్మాత పెళ్లి విషయమై ఎవరు అఫీషియల్‌గా ప్రకటనలు మాత్రం చేయడం లేదు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య.. అనారోగ్యం కారణంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు తన సొంత ప్రొడక్షన్ హౌస్ వెంకటేశ్వర బ్యానర్ సినిమాల్లో తన సినిమాలకు భార్య పేరునే ముందుగా వేస్తుంటాడు. ఈ దంపతులకు ఒకే కూతురు కాగా ఆమెకు పెళ్లి అయిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో ఈయనకు తోడు కావాలని.. దాంతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహాలు ఇవ్వడంతో దిల్‌రాజు కూడా పెళ్లి వైపు అడుగు వెస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు పెళ్లి చేసుకున్నావిడ గతంలో కొన్నాళ్లు ఎయిర్ హోస్ట్రెస్‌గానూ పని చేసింది. మరోవైపు ఈ పెళ్లికి దిల్ రాజు కూతురు కూడా ఒప్పుకుందని.. ఆమె నిర్ణయం కోసమే ఇన్ని రోజులు దిల్ రాజు వేచి చూసాడని తెలుస్తుంది. తాత అయినా కూడా దిల్ రాజు మాత్రం అలా అయితే కనిపించడు. దిల్ రాజు కులాంతర వివాహం చేసుకుంటున్నాడని.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారని తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు.