మహేష్ బాబు ‘గుంటూరు కారం’ విడుదల తేదీ (జనవరి 12) దగ్గర పడుతున్న నేపథ్యంలో వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు గుంటూరులో గ్రాండ్‍గా జరుగుతోంది. మహేశ్ బాబు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి, దర్శకుడు త్రివిక్రమ్ సహా మూవీ టీమ్ సభ్యులు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరైయ్యారు.
ఈ ఈవెంట్‍లో ప్రముఖ నిర్మాత దిల్‍రాజు మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమా మహేశ్ బాబు అభిమానులకు పండగలా ఉంటుందని దిల్‍రాజు చెప్పారు. ఈ చిత్రంలో మహేశ్ క్యారెక్టరైజేషన్ చూస్తే తనకు బ్లాక్‍బాస్టర్ సినిమాలు పోకిరీ, దూకుడు గుర్తొచ్చాయని ఆయన అన్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ గురించి కూడా ప్రస్తావించారు.
‘మహేశ్ బాబు ఈ సినిమాతో కలెక్షన్లతో తాట తీస్తారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ రాసిన విధానం.. నేను చూసిన ఎపిసోడ్లలో, ఆ ట్రైలర్‌తో నాకు గుర్తుకొచ్చిన సినిమాలు ఏవో తెలుసా.. ఒక పోకిరి. పోకిరీలో క్యారెక్టరైజేషన్ మాములుగా ఉండదు. దూకుడులో కూడా మూమూలు క్యారెక్టరైజేషన్ కాదది.
చాలా కాలం తర్వాత ఈ క్యారెక్టర్ చూస్తుంటే.. రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ వదులుతున్న గుంటూరు కారమే మన మహేశ్ బాబు. సిద్ధంగా ఉండండి’ అని దిల్‍రాజు చెప్పారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీ పాట కోసం రెడీగా ఉండాలని మహేశ్ అభిమానులకు చెప్పారు దిల్‍రాజు. ‘ఈ సంక్రాంతి మహేశ్ అభిమానులకు చాలా పెద్ద పండగ. సినిమానే కాదు.. మహేశ్ గత రెండు, మూడు సినిమాల నుంచి ఓ పాటకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. అది మీ కోసం. ఈ సినిమాలో ఆ కుర్చీ పాట కోసం మీరు ప్రిపేర్ అయి ఉండండి. సినిమా చూసేటప్పుడు ఆ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూడండి’ అని దిల్‍రాజు అన్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతి బాబు, జయరాం, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించారు. హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ నైజాం (తెలంగాణ) హక్కులను దిల్‍రాజు సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి ఇతర చిత్రాలు పోటీలో ఉన్నా గుంటూరు కారం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.