HomeTelugu Big Storiesడిజె క్లైమాక్స్ రచ్చ రచ్చే!

డిజె క్లైమాక్స్ రచ్చ రచ్చే!

తెలుగు సినిమాల్లో ఓ భారీ క్లైమాక్స్ ఫైట్స్ తో ఎండ్ కార్డ్ పడుతుంది. ఇది ఎప్పటినుండో అందరూ ఫాలో అవుతున్నదే. ఇక స్టార్ హీరో, యాక్షన్ సినిమా అంటే పోరాట సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విషయంలో మాత్రం దీనికి భిన్నంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ తో శుభం కార్డ్ వేయనున్నారని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కోసం భారీ యాక్షన్ క్లైమాక్స్ డిజైన్ చేసినప్పటికీ దిల్ రాజు సూచనల మేరకు దాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అవును.. డిజె క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఫైట్ లేదు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి నవ్వులతో ఇంటికి పంపిస్తారని సమాచారం. అయితే ప్రీక్లైమాక్స్ లో భారీ పోరాట సన్నివేశాలు ఉన్నాయట.
వెంటవెంటనే ఫైట్స్ అంటే ఆడియన్స్ కు బోర్ కొట్టే అవకాశాలు ఉన్నాయనేది దిల్ రాజు లాజిక్. మాస్ పల్స్ తెలిసిన నిర్మాత కావడంతో ఆయన మాటలను ఫాలో అయిపోయాడు దర్శకుడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా విషయంలో కూడా దిల్ రాజు ఇదే ఫార్ములాను పాటించాడు. యాక్షన్ సీన్ తో ఆ సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుందనుకుంటే.. ఓ కామెడీ సీన్ తో సినిమాను ముగించారు. డిజె సినిమాలో కూడా క్లైమాక్స్ సన్నివేశాలు హిళారియస్ గా ఉంటాయని చెబుతున్నారు. ఇది వర్కవుట్ అయితే దిల్ రాజు ఖాతాలో మరో భారీ హిట్టు సినిమా పడినట్లే!
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu