పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేధా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో ప్రతిరోజూ షూటింగ్ ఉంటున్న నేపథ్యంలో సమయాభావాన్ని తగ్గించేందుకు పవన్ కల్యాణ్‌కు ఆ సినిమా నిర్మాత దిల్‌రాజు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించారని సమాచారం. ఇప్పటికే ఓ విమానయాన సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం దిల్‌రాజు దాదాపు రూ.కోటి ఖర్చు చేయనున్నారని సినీవర్గాల ద్వారా వినిపిస్తోంది. కాగా.. ఈ సినిమా షూటింగ్లో పవర్‌స్టార్ పాల్గొన్న కొన్ని ఫొటోలు బయటికి లీక్ అవడంతో పవర్‌స్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారని, సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచాలని నిర్మాణ సంస్థకు ఆయన సూచించినట్లు సమాచారం.