ప్రముఖ సీనియర్ నటుడు, స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు సినీనటులు తారక్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. తారక్ వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులకు అక్కడకు చేరుకున్నారు. తారక్ కు మద్దతుగా నినాదాలు చేసారు.
సీఎం సీఎం అంటూ స్లోగన్స్ చేసారు. కానీ, తారక్ ఎక్కడా స్పందించలేదు. ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఆ తరువాత నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు టాక్. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉండిపోవడం అందరిని షాక్‌కి గురిచేసింది. నందమూరి, నారా కుటుంబాలకు మధ్య విభేదాలు ఉన్నాయి అప్పుడు వార్తలు గుప్పు మన్నాయి.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనతో ఈ వివాదం మరింత ముదిరిన్నట్లు అనిపిస్తుంది.