Homeపొలిటికల్జగన్‌- పవన్‌ ఫ్యామిలీల మధ్య డిఫరెన్స్‌ ఇదే.. వీడియో వైరల్‌

జగన్‌- పవన్‌ ఫ్యామిలీల మధ్య డిఫరెన్స్‌ ఇదే.. వీడియో వైరల్‌

pawan kalyan and jagan

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా జరగనున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారం చేజిక్కించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల్లో మళ్లీ గెలవగలడా? ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఈసారి జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ గత ఎన్నికలకు ముందు అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పార్టీకి అండగా తన కుటుంబం నిలబడింది. తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల పార్టీ బాధ్యతలను తమ భుజాన వేసుకున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేశారు.

అయితే ఈసారి ఎన్నికల్లో జగన్‌కు తన సొంత కుటుంబం నుంచే మద్దతు లేకుండా పోయింది. వైఎస్ జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఉన్నారు. జగన్ తల్లి విజయమ్మ సైతం జగన్‌కు మద్దతు ఇవ్వటం లేదు. జగన్‌పై తన సొంత కుటుంబ సభ్యులే పలు ఆరోపణలుచేస్తున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు. రాజన్న రాజ్యం తెస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను దోచుకుంటున్నాడని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశాడని, పన్నుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వరుస ఆరోపణలతో వైఎస్ జగన్‌పై షర్మిల ధ్వజమెత్తుతోంది.

మరోవైపు జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు తానే మీడియా ముందుకు వచ్చి తన అన్న జగన్‌కు ఓటెయ్యొద్దని ప్రజలను కోరుకుంటున్నారు. ఆయనకు ఓటేస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ ఉండదు, వంచన, మోసంతో కేవలం తన అనుకున్నవారికే సాయం చేసి మిగతా వారికి అన్యాయం చేసే పార్టీకి ఓటెయ్యొద్దని ప్రజలను కోరుతున్నానంటూ మీడియా సమావేశంలో కోరారు. తన తండ్రి హత్య జరిగి 5 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు దర్యాప్తు పూర్తి కాలేదని, కోర్టులో ట్రయల్ ప్రారంభం కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అంతిమ కుట్రదారులను తేల్చాలని డిమాండ్ చేశారు.

పాలనలో ఎప్పుడూ హత్యా రాజకీయాలు ఉండకూడదని, హంతకులు మనల్ని పాలించకూడదని, వారికి అలాంటి అవకాశం ఇవ్వకూడదని సునీత అన్నారు. అందుకే మా అన్నకు ఓటెయ్యొద్దని ప్రజలను కోరుతున్నానంటూ విజ్ఞప్తి చేశారు.

వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌తో పాటు జనసేన అధినేతపై సీఎం జగన్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ అస్తమాను 3 పెళ్లిళ్లు 2 విడాకులు అంటూ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నా నాలుగో పెళ్లాం జగనే అంటూ రా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ ఎన్నికల సమరానికి ముందు సోషల్ మీడియాలో పోరు పోటా పోటీగా మారింది. ఇటీవల, పవన్ మరియు జగన్‌కు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ప్రతిస్పందనను పోల్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్ తల్లి అంజనమ్మ తాను చూసిన అత్యంత బాధ్యతగల వ్యక్తులలో పవన్ ఒక్కరుగా పేర్కొనడం మనం చూడవచ్చు. తన కుమారులకు తానే మొదటి అభిమానిని అని తెలిపింది. చిరంజీవి కూడా రాజకీయాల్లో తన తమ్ముడు పవన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. రాజకీయ జీవితంలో పవన్ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తన మేనల్లుడు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పలు ఇంటర్వ్యూలలో పవన్ అడిగితే మరో ఆలోచన లేకుండా జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లారని, అంతా అయిపోయాక కాదని చెప్పాడు. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌పై వారి కుటుంబ సభ్యుల భిన్నాభిప్రాయాలతో కూడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Archana Royal (@archana_janasena)

Recent Articles English

Gallery

Recent Articles Telugu