సాయి పల్లవి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్


హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామితో మెడలో పూలదండలతో ఉన్న ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వార్తలపై దర్శకుడు పెరియసామి క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో అది అవాస్తవమని తేలింది.

నటుడు శివకార్తికేయన్‌తో కలిసి సాయిపల్లవి ఓ సినిమా చేస్తోంది. SK21 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా సినిమా యూనిట్‌తో పాటు హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడి మెడలో పూలదండలు వేశారు.

ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సాయి పల్లవి పెళ్లి అయిపోయిందని నానా హంగామా చేసేశారు. ఆ ఫొటో సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా తీసిందంటూ విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల కూడా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu