Game Changer losses:
మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూసిన “గేమ్ ఛేంజర్” చిత్రం జనవరి 10, 2025న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ చరణ్‌కు ప్రత్యేకమైనది. ఇది శంకర్‌తో రామ్ చరణ్ మొదటి చిత్రం కావడం, అలాగే నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు థమన్ కూడా శంకర్‌తో తొలిసారి పని చేయడం విశేషం.
శంకర్ సినిమాలు భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఒకవైపు IAS ఆఫీసర్ రామ్ నందన్ పాత్రలో, మరోవైపు గ్రామీణ యువకుడు అప్పన్న పాత్రలో చరణ్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు పొగడ్తలు కురిపిస్తున్నారు.
అయితే, ఈ సినిమా వల్ల రామ్ చరణ్‌కు సుమారు రూ.100 కోట్లు నష్టం వచ్చిందని తాజా వార్తలు వినిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ అనేక కారణాలతో చాలా నెలలు వాయిదా పడింది. ఈ సమయంలో రామ్ చరణ్ ఇంకో సినిమా సైన్ చేయలేదు. దీంతో ఇతర సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోయారు. ముఖ్యంగా హను రాఘవపూడి దర్శకత్వంలో UV క్రియేషన్స్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా ఈ డిలే వల్ల క్యాన్సిల్ అయ్యింది.
ఈ సినిమాకి రామ్ చరణ్ రూ.75 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ, ఇతర ప్రాజెక్ట్‌లు చేసుంటే అదనంగా రూ.100 కోట్లు సంపాదించేవారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే గేమ్ చేజర్ వల్ల రామ్ చరణ్ కి 100 కోట్ల నష్టం జరిగింది.