SSMB29 release date:
మహేశ్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 మూవీ జనవరి 2, 2025న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ చాలా సింపుల్‌గా, ప్రైవేట్ ప్రాంగణంలో జరిగింది. ఫోటోలను అధికారికంగా బయట పెట్టలేదు. రాజమౌళి ప్లాన్ ప్రకారం, మహేశ్ బాబు కొత్త లుక్ తో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, SSMB29 గురించి కొంచెం క్లూస్ ఇచ్చారు. “కరోనా లాంటివి లేకపోతే, ఈ సినిమా మరో సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరంలో రిలీజ్ అవుతుంది,” అని ఆయన సరదాగా చెప్పారు. రాజమౌళి కూడా నవ్వుతూ, “బాగా ట్రైనింగ్ ఇచ్చాననుకుంటా!” అని రిప్లై ఇచ్చారు. రామ్ చరణ్ హింట్ ప్రకారం, ఈ సినిమా 2026 జూలై లేదా ఆగస్టులో థియేటర్స్‌లోకి రానుంది.
“If no pandemic hits, then #SSMB29 will release within 1 1/2 year”
– #RamCharan at #GameChanger trailer launch event#MaheshBabu pic.twitter.com/iH3AvRp9lc— VardhanDHFM (@_VardhanDHFM_) January 2, 2025
రాజమౌళి సినిమాలు తీసుకునే సమయంలో ఎప్పుడూ క్వాలిటీపై ఎక్కువ దృష్టి పెడతారు. బాహుబలి & RRR లా ఇప్పుడు SSMB29 కూడా గ్రాండ్‌గా ఉండబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయి. షూటింగ్ ఏప్రిల్ 2025లో ప్రారంభం అవుతుందని సమాచారం.
ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాకు ₹1000 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చవుతోంది. మహేశ్ బాబు పాత్ర హనుమంతుడి పాత్ర నుంచి ప్రేరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. మైథాలజీకి యాక్షన్ మిక్స్ చేసిన కథతో సినిమా గ్రాండ్ విజువల్స్, ఎపిక్ స్టోరీలైన్‌తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించనుంది.
ALSO READ: Daaku Maharaj హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?