
Shah Rukh Khan – Neil Nitin Mukesh:
2009 ఫిలింఫేర్ అవార్డ్స్‌లో నీల్ నితిన్ ముఖేష్ షారుఖ్ ఖాన్‌ను “షట్ అప్” అనాడని చెబుతూ ఓ వీడియో వైరల్ అయింది. నిజంగా అలా జరిగిందా? లేక అది ఒక రూమరా?
షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఫిలింఫేర్ అవార్డ్స్ హోస్ట్ చేస్తూ నీల్ నితిన్ ముఖేష్ పేరు గురించి సరదాగా కామెంట్ చేశారు. “మీరు మూడు ఫస్ట్ నేమ్స్ కలిపి పెట్టుకున్నారు, కానీ మీకు సరైన సర్ నేమ్ లేదా?” అని జోక్ చేసారు. దీనికి నీల్ తక్షణమే స్పందించి, “అది నాకు అవమానం. నా తండ్రి (నితిన్ ముఖేష్) ఇక్కడ కూర్చున్నారు. మీరందరూ నోరు మూసుకుంటే మంచిది” అన్నారు.
ఈ మాటలు కొంతమంది షారుఖ్ ఖాన్‌ను అవమానించినట్లుగా భావించారు. అయితే, ఆ సంఘటన గురించి ఆ తర్వాత నీల్ స్పందిస్తూ, “షారుఖ్ సర్ అంటే నాకు అపారమైన గౌరవం. అది స్టేజ్‌పై జరిగిన సరదా మాటలే. నేను ఆయనను అవమానించే ఉద్దేశ్యంతో అలా చెప్పలేదు” అని వివరించాడు.
ఈ సంఘటన జరిగిన 15 ఏళ్ల తర్వాత కూడా ఈ వీడియో అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఇప్పటికీ నీల్ నిజంగానే షారుఖ్‌ను అవమానించాడని భావిస్తుండగా, మరికొందరు ఇది సరదా పరిస్థితేనని అంటున్నారు.
ప్రస్తుతం నీల్ నితిన్ ముఖేష్ ‘హిసాబ్ బరాబర్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో అవినీతిని కేంద్రంగా చేసుకుని తెరకెక్కించిన కామెడీ-డ్రామా.