స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నయన్ కు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్ ను నయన్ ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విగ్నేష్ ఇంకా ఫాలో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి.
అయితే నయన్ ఏదో ఒక సాడ్ కోడ్ పెట్టేసరికి విక్కీతో ఏదో గొడవ జరిగి ఉంటుంది, అందుకే అన్‌ఫాలో చేసి ఇలా కొటేషన్ పెట్టిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ విడిపోతున్నారా?, పొరపాటున జరిగి ఉండొచ్చు, సాంకేతిక తప్పిదం కావొచ్చని అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఇందులో నిజం లేదు అని. పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిపోయింది.
ఎందుకంటే నయనతార ఇన్‌స్టా ఫాలోయింగ్ లిస్ట్‌లో సెర్చ్ చేస్తుంటే విఘ్నేష్ పేరు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏదో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని అర్థమవుతుంది. ఇంత మాత్రానికే వీళ్లకి విడాకులు అంటూ మీడియా వార్తలు రాయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
నయనతార, విఘ్నేశ్ దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2022 లో దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు ఇటీవలే కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. ఈ పిల్లల ఫొటోలతోనే నయన్, విఘ్నేశ్ లు ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫొటో తమ పిల్లలను చూపిస్తూ పోస్ట్ చేశారు.