Nani Saripodhaa Sanivaaram:
ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్ తో నాచురల్ స్టార్ నాని చాలా బిజీగా ఉన్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఎస్ జె సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాని సినిమాల విడుదల తేదీల గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
“క్లారిటీ లేకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఒక డేట్ వేసేద్దాం. అయితే అయింది లేకపోతే తర్వాత వద్దాం అనే ఆటిట్యూడ్ మంచి పద్ధతి కాదు” అని అన్నారు నాని.
అయితే దాదాపు స్టార్ హీరోలు సినిమాల అన్నిటి విషయంలోనూ ఇవే జరుగుతూ వస్తోంది. ఏదో ఒక డేట్ పేరుకి చెప్పడం.. ఆ తరువాత అనుకున్న తేదీకి సినిమాని రిలీజ్ చేయలేక.. మరొక తేదీకి వాయిదా వేయడం స్టార్ హీరోలో సినిమాలకి చాలా కామన్ విషయం అయిపోయింది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 కూడా ఆగస్టు 15న విడుదల కావాలి కానీ.. డిసెంబర్ 6 కి వాయిదా పడింది. చాలానే స్టార్ హీరోల సినిమాలు ఇలానే వాయిదా పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నాని వారిని ఉద్దేశించే ఇలా కామెంట్ చేసి ఉంటారా అని కొందరు అంటున్నారు. అయితే నాని ఇది మామూలుగా చెప్పినా విషయం కానీ.. కావాలి నీ ఎవరినో టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో చేసిన పని కాదు అని చెప్పుకోవచ్చు.
మరోవైపు ఈ మధ్యనే నాని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కి వ్యతిరేకంగా కామెంట్ చేసిన సంగతికి తెలిసిందే. ప్రభాస్ విషయంలో ప్రభాస్ కే సపోర్ట్ చేసిన నాని సరిపోదా శనివారం సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షకులు నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. మరి ఆగస్టు 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.