Mufasa: The Lion King Movie Review:
డిస్నీ ప్రేక్షకులను మళ్లీ సింహాల ప్రపంచానికి తీసుకెళ్లే ప్రయత్నంలో ముఫాసా: ది లయన్ కింగ్ కొత్త స్పిన్-ఆఫ్‌గా వచ్చింది. చిన్నతనం నుంచే ముఫాసా, టాకా (తర్వాత స్కార్) మధ్య ఉన్న అనుబంధం, విభేదాలను చూపించటం ఈ సినిమా ప్రధాన కథాంశం. తెలుగులో ప్రముఖ స్టార్లు తమ గొంతు అందించడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కథ:
ముఫాసా అనాథ సింహం పిల్ల. తన తల్లిదండ్రులను వరదలో కోల్పోతాడు. ఆ సమయంలో టాకా అనే యువ సింహపు రాజు అతనిని స్నేహితుడిగా ఆహ్వానిస్తాడు. ముఫాసా నిజమైన పుట్టుక బయట పడటం టాకాకు అసహనం కలిగిస్తుంది. ముఫాసా, టాకా మధ్య స్నేహం విరిగిపోయిందా? ఇద్దరి ప్రయాణం జాజీ, రఫికీ, సరాబి వంటి పాత్రలతో కలిసి సాగుతుంది.
నటీనటులు:
మహేశ్ బాబు ముఫాసా పాత్రకు గొంతు అందించి తన కదలికలను మాటలతో మెప్పించారు. మహేష్ వాయిస్ సినిమాకి అతిపెద్ద హైలైట్. టాకా పాత్రకు సత్యదేవ్ అద్భుతమైన మోడ్యులేషన్ చూపించి పాత్రలో జీవం పోశారు. బ్రహ్మానందం, అలీ చేసిన పుంబా, టిమోన్ పాత్రలు హాస్యంతో ఆకట్టుకుంటాయి. కిరోస్‌గా అయ్యప్ప పి శర్మ విభిన్నత చూపించారు.
Voicing Mufasa has been an incredible experience that I’ll always hold close to my heart. I hope you experience the same joy watching Disney’s Mufasa: The Lion King as I did.#MufasaTheLionKing #HakunaMufasa @DisneyStudiosIN pic.twitter.com/bGYzlS6nN3
— Mahesh Babu (@urstrulyMahesh) December 19, 2024
సాంకేతిక అంశాలు:
జేమ్స్ లాక్స్టన్ ఆధ్వర్యంలో సృష్టించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నికోలస్ బ్రిటెల్ సంగీతం భావోద్వేగాలకు బలాన్నిస్తుంది. కానీ పాటలు ఆకట్టుకునే స్థాయిలో లేవు. తెలుగు డైలాగ్స్ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
*మహేశ్ బాబు, సత్యదేవ్ గొంతులు.
*విజువల్ గ్రాండియర్
*ముఫాసా చిన్ననాటి క్షణాలు.
మైనస్ పాయింట్స్:
-స్క్రీన్ ప్లే.
-సింహాలు మానవ హావభావాలు ప్రదర్శించడం.
-నిరుత్సాహపరిచే పాటలు.
తీర్పు:
విజువల్ గ్రాండియర్ ఉన్నా, ముఫాసా: ది లయన్ కింగ్లో భావోద్వేగాలు తక్కువ అయినట్టు అనిపిస్తుంది. లయన్ కింగ్ అభిమానులు తప్ప, సాధారణ ప్రేక్షకులకు ఇది పూర్తిస్థాయి అనుభూతిని అందించకపోవచ్చు.
Rating: 2.5/5
ALSO READ: Aadi Saikumar’s Supernatural Thriller Shambala Begins Shooting