
Allu Arjun – Salman Khan:
భారతీయ సినిమాల్లో 30 సంవత్సరాలుగా స్టార్‌గా నిలిచిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. ఆయనకు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నా, ‘బజరంగి భాయిజాన్’ అనేది ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన హిట్. ఈ సినిమా మొదటగా పుష్ప స్టార్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లిన సంగతి మీకు తెలుసా?
2015లో విడుదలైన బజరంగి భాయిజాన్ లో పవన్ అనే వ్యక్తి తప్పిపోయిన మున్నీ అనే మాట్లాడలేని పాకిస్తాన్ చిన్నారిని తల్లి దండ్రుల దగ్గరకు చేర్చే ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. హనుమాన్ భక్తుడైన పవన్ తన సత్యనిష్ఠతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ చివరకు తన లక్ష్యాన్ని చేరుకుంటాడు.
View this post on Instagram
ఈ సినిమా ముందుగా అల్లు అర్జున్ కి ఆఫర్ చేశారట. కానీ, తన బిజీ షెడ్యూల్ వల్ల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశారు అని టాక్. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆమిర్ ఖాన్ దగ్గరకు వెళ్లింది. కానీ ఆయన స్క్రిప్ట్‌కి మార్పులు చేయాలని కోరడం, దర్శకుడు కబీర్ ఖాన్ అంగీకరించకపోవడంతో ఆమిర్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను వదిలేశారు. చివరకు సల్మాన్ ఖాన్ ఈ రోల్‌కి ఒప్పుకుని, సినిమాను సూపర్‌హిట్‌గా మార్చారు.
ఈ సినిమా రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే, భారత్‌లో రూ. 320 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా రూ. 922 కోట్లను వసూలు చేస్తూ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సల్మాన్ ఖాన్‌కి ఈ సినిమా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2025 ఈద్‌కి విడుదల కానుంది.
ALSO READ: Hyderabad లో Celebrity Restaurants హవా మామూలుగా లేదుగా!