HomeTelugu Big Storiesపోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో Allu Arjun కన్నీళ్లు పెట్టుకున్నారా?

పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో Allu Arjun కన్నీళ్లు పెట్టుకున్నారా?

Did Allu Arjun Break Down During Investigation?
Did Allu Arjun Break Down During Investigation?

Allu Arjun Police Investigation:

బన్నీ జీవితంలో కష్టకాలం నడుస్తోంది అని అందరికీ తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జీవితంలోనే మొదటిసారి భారీ స్థాయిలో లీగల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణకు హాజరయిన రోజు పెద్ద చర్చగా మారింది. ఈ సందర్భంగా ధియేటర్ లో జరిగిన సంఘటనలకు సంబంధించి బన్నీ భావోద్వేగానికి గురయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి పత్రిక ప్రకారం, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన మహిళ రేవతి వీడియోలు చూస్తూ బన్నీ కంటతడి పెట్టారట. అయితే ఈనాడు పత్రిక వారు అల్లు అర్జున్ భావోద్వేగంతో లోనయ్యారని పేర్కొన్నప్పటికీ, ఆయన ఏడవడంపై స్పష్టత ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో, ప్రధాన పత్రికల్లో అనేక కథనాలు, వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? బన్నీ నిజంగా ఏడ్చారా? ఆయనపై దాఖలైన కేసులు ఎలా పరిష్కారమవుతాయి? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. పోలీసులూ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.

బన్నీ, అభిమానురాలైన రేవతి విషయంలో తాను ఎంత బాధపడ్డారో చూపించే ప్రయత్నం చేసినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ సమస్యలు త్వరలో పరిష్కారమయితే బావుంటుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ: Flop director చేతుల్లో పడ్డ 200 కోట్ల సినిమా!

Recent Articles English

Gallery

Recent Articles Telugu