బాలీవుడ్ నటి దియా మీర్జా ముంబై బిజినెస్ మేన్ వైభవ్ రేఖీని పెళ్లాడారు. సోమవారం సాయంత్రం ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దియా.. వైభవ్ ఇరువురికి ఇది రెండో వివాహం. హిందూ సాంప్రదాయంలో వీరి వివాహం జరిగినట్లు ఫొటోలు చూస్తే పెళ్లి అని అర్థమవుతోంది. పెళ్లిలో సాంప్రదాయ వివాహ ఆభరణాలతో ఎరుపు రంగు జరీ చీరలో దియా చాలా అందంగా కనిపించారు. అత్యంత సన్నిహితులు దంపతుల బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. బాలీవుడ్ నుంచి అదితీరావు హైదారి.. జాకీ భగ్నాని.. గౌతమ్ గుప్తా వివాహంలో అతిథులుగా కనిపించారు.
View this post on Instagram