రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధృవ’. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 9న విడుదలయిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినిమాలపై ఉన్నప్పటికీ ఈ సినిమా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా విడుదలయిన నాలుగు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి 25.70 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే 8 కోట్ల 74 లక్షలు కలెక్ట్ చేసింది.
ఇక సీడెడ్, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి 16 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. శాటిలైట్ రూపంలో ఇప్పటికే 9 కోట్లు నిర్మాత అకౌంట్ లో చేరాయి. దీన్ని బట్టి సినిమా 50 కోట్ల లిస్ట్ లోకి చేరడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి టేకింగ్, చరణ్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, అరవింద్ స్వామి నటన ఇలా అన్ని కలిసి సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.